WEL COME TO

SRI MADHANA GOPALA SWAMY

  • “Connecting hearts, connecting souls, connecting with the divine.”

PUJA SEVA

SRI VENKATESHWARA SWAMY TEMPLE AT BALLIPADU

Sri Swami Vari Annual Festival Invitation

* Sri Swami Vari Punyatithi Mahotsavam

SRI MADHANA GOPALA SWAMY TEMPLE

Sri Swami Vari Annual Festival Invitation

* Sri Swami Vari Alankara Kainkarya Seva

BALLIPADU MADHANA GOPALA SWAMY

Sri Swami Vari Annual Festival Invitation

Sri Swami Vari Maha Prasadam Distribution

"Once again welcome to Sri Madhana Gopala Swamy Temple at Ballipadu

SRI MADHANA GOPALA SWAMY BALLIPADU TEMPLE HISTORY

1770 దశకములో బల్లిపాడు గ్రామస్తులు జీవనార్థం పాలకొల్లు మండలం, పెనుమదం గ్రామం వెళ్ళి చెరువు తవుచుండగా శ్రీ మదన గోపాలస్వామి వారి విగ్రహం బయల్పడినది. శ్రీ స్వామివారి విగ్రహం పెనుమదం గ్రామము నుండి బల్లిపాడు తీసుకువచ్చినారు.

సదరు
శ్రీ స్వామివారి విగ్రహం గూర్చి పెనుమదం గ్రామస్తులు వచ్చి విగ్రహం ఇవ్వమని వివాదం చేయగా సదరు పెద్దలు అందరిని అతిధి మర్యాదలతో సత్కరించి మా గ్రామములో ఆలయము కట్టి విగ్రహ
ప్రతిష్ట చేసి భూములు ఏర్పాటు చేయుదుము అని
చెప్పి పెనుమదం
గ్రామస్తులను పంపించివేసియున్నారు.

బల్లిపాడు గ్రామస్తులు ఏకస్థులై శ్రీ స్వామివారికి 1773 వ సంవత్సరములో ఆలయ నిర్మాణము చేసియున్నారు. 1901 వ సంవత్సరములో గ్రామస్తులచే ధ్వజస్థంభము ఏర్పాటు చేయబడినది. 1970 వ సంవత్సరములో శ్రీ స్వామివారి సన్నిధిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయము నిర్మించి శ్రీ స్వామి
వారి
ఆలయమును దివ్యస్థలముగా చేసియున్నారు.
19వ శతాబ్దం మొదటి భాగములో
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి ఆలయ ధర్మకర్తలకు, అర్చకులకు వివాదము వచ్చినప్పుడు కొంతకాలము శ్రీ వేంకటేశ్వర స్వామి వార్కి, నిత్యధూప, దీప,
నైవేద్యములకు అంతరాయము కలిగెను. ఆ సమయమున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
అంశ ద్వారకాతిరుమల నుండి బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామిలో ప్రవేశించెనని ప్రతీతి. ఆ కారణముగానే నిత్య
ఆరాధనలో శ్రీ మదన గోపాలస్వామి వార్కి నమోవాకములు చెప్పుచూ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామియే నమః